తూర్పుగోదావరి జిల్లా కామరాజుపేటకు చెందిన జట్ల తాసు గత నాలుగు రోజులు క్రితం పశువులు మేపేందుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో అతని కుమారుడు శ్రీను మూడు రోజులుగా వెతుకుతున్నాడు. ఈ క్రమంలో పశువుల కాపరులు బ్రిడ్జి కింద ఉన్న మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. బంధువులు మృతదేహాన్ని పరిశీలించి జట్ల తాసు గా నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.