ఐఫోన్ 16 సిరీస్ కెమెరా స్సెసిఫికేషన్స్
NEWS Aug 24,2024 03:02 pm
సెప్టెంబర్ 10న ఐఫోన్ 16 సిరీస్ వస్తుందనే వార్తల నేపథ్యంలో.. ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ల కెమెరా ఫీచర్లు లీకయ్యాయి. కెమెరా స్పెసిఫికేషన్స్‌లో యాపిల్ భారీ మార్పులు చేపట్టిందట. అధిక రిజల్యూషన్‌తో కూడిన అల్ట్రా వైడ్ కెమెరా, క్యాప్చర్ బటన్ సహా పలు మార్పులు ఉంటాయట. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ బ్యాక్ ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయని తెలుస్తోంది. 1x, 2x జూమ్ సామర్ధ్యాలతో ప్రైమరీ వైడ్‌యాంగిల్ లెన్స్‌తో కెమెరా సెటప్ ఉంటుంది. దీంతోపాటు విస్తృతమైన సీన్స్‌ను క్యాప్చర్ చేసేందుకు 0.5x జూమ్‌తో సెకండరీ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయనే వార్తలు వస్తున్నాయి.