అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో కారు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం పాడేరు నుంచి ఆటోలో మైదాన ప్రాంతం వైపు వెళుతుండగా ఏసుప్రభు కార్నర్ మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలు అయ్యాయి. మాడుగుల ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.