తూ.గోదావరిలో మరో అల్పపీడనం
NEWS Aug 24,2024 05:06 pm
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. కాకినాడ జిల్లాలో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించింది. SHARE IT..