అరకులోయ మండలంలోని చినలబుడు రైతు సేవా కేంద్రం పరిధిలో 180 మంది రైతులకు 90% రాయితీ రాజ్మా విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని VHA దశరథ్ తెలిపారు. చినలబుడు రైతు సేవా కేంద్రంకు మొదటి విడతలో వచ్చిన టన్ను రాజ్మా విత్తనాలను సర్పంచ్ బురిడి ఉపేంద్ర ఆధ్వర్యంలో రైతులకు పూర్తిగా పంపిణీ చేసినట్లు VHA పేర్కొన్నారు. 2వ విడతలో రాజ్మా విత్తనాలు వస్తే మిగిలిన రైతులకు అందజేయగలమని VHA తెలియజేశారు.