గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
NEWS Aug 24,2024 03:07 pm
కాకినాడ: ధనార్జన కోసం గంజాయి అమ్ముతున్న బీహార్ కు చెందిన ఇద్దరిని కాకినాడ పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్ రోడ్ లో సాత్విక్ గోడౌన్స్ ఎదురుగా వీరు గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని రవీందర్ యాదవ్, రాజేష్ ఠాగూర్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.