ప్రతి విద్యార్థి విద్యా దశ నుంచే న్యాయ సూత్రాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమదాలవలస సివిల్ జడ్జి ఎస్ మణి అన్నారు. బూర్జ మండలం ఓవి పేట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ విద్యా దశలోనే క్రమశిక్షణ, విద్య నేర్పే గురువులపై గౌరవంతో ఉండాలని అలాగే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు, బూర్జ ఎస్ఐ. ప్రవల్లిక, ప్రిన్సిపాల్ బీ శ్రీనివాసరావు ఉన్నారు.