ఆసుపత్రి పెండింగ్ బకాయిలు విడుదల
NEWS Aug 24,2024 03:04 pm
శ్రీసత్యసాయిజిల్లా: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు చెల్లింపులు విడుదల చేయడం జరిగిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఇచ్చిన హామీ మేరకు రూ.300 కోట్లు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. నిధులు విడుదల పట్ల పట్టణ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశారు.