హైవే చెక్ పోస్టుల్లో డీఎస్పీ తనిఖీ
NEWS Aug 24,2024 05:06 pm
హిందూపురం DSPగా బాధ్యతలు స్వీకరించిన KV మహేశ్ సంబంధిత ఇన్స్పెక్టర్లతో సబ్ డివిజన్ పరిస్థితులపై సమీక్ష చేశారు. లా ఆండ్ ఆర్డర్, కిందిస్థాయి సిబ్బంది పనితీరు, పత్రికలలో ప్రచురితమైన వార్తలు, వాటిపై నిజానిజాలను క్షుణ్ణంగా సమీక్ష చేశారు. హిందూపురం సబ్ డివిజన్ పరిధిలోని కోడికొండ, తూముకుంట చెక్ పోస్టుల్లో పోలీస్ సిబ్బందికి తోడ్పడే విధంగా అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.