అనంతగిరి పోలీసు స్టేషన్ ను అరకు సర్కిల్ ఇనస్పెక్టర్ ఎల్ హిమగిరి సందర్శించారు. ఈ సందర్భంగా అనంతగిరి పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. అదేవిధంగా స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును సబ్ ఇనస్పెక్టర్ కె రామును అడిగి తెలుసుకున్నారు. పర్యాటక కేంద్రాలలో అసాంఘిక కార్యకలాపాలు జయగకుండా చూడాలని సూచించారు. స్టేషన్ సిబ్బందితో వాహన తనిఖీలు చేశారు.