ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
NEWS Aug 24,2024 01:19 pm
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ కోరారు. మడకశిర పట్టణంలో జిల్లా అధ్యక్షుడు వీరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. డివిజన్లో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.