ఐ.పోలవరం మండల బిజెపి సమావేశం టీ. కొత్తపల్లి గ్రామంలో మండల బిజెపి ఉపాధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు అధ్యక్షతన మండల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు హాజరై జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో ఐ పోలవరం మండలం ప్రథమ వరుసలో ఉండాలని కోరారు. ఆగస్టు 31 న జిల్లాలో అన్ని పోలింగ్ బూత్‌లలో సమావేశాలు జరగాలని అన్నారు.