పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్?
NEWS Aug 24,2024 12:11 pm
పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. దిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్, డిఫ్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ సమాలోచనలు జరిపారు. AICC అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్ర బృందం వేర్వేరు అభిప్రాయాలు తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ సామాజికవర్గం నుంచి మహేశ్ కుమార్ గౌడ్, మధుయాస్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి సంపత్ కుమార్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లను రాష్ట్ర నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వీరిలో మహేశ్ గౌడ్‌కు మెరుగైన అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.