నోటీసులు ఇవ్వకుండానే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారని వస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొట్టిపారేశారు. నోటీసులు ఇచ్చామని.. ఆ తర్వాతనే కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని.. అక్రమ కట్టడాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని తెలిపారు. 2014కు ముందు హైదరాబాద్‌లో చెరువులెన్ని ఉన్నాయి.. ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయి అనే లెక్కలను.. శాటిలైట్ సమాచారం ఆధారంగా రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాప్‌లతో బయటపెడతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.