డిసెంబర్ 1 నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ చెప్పారు. నాలుగేళ్లలోపు రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రూ.60 వేల కోట్లు అవసరమవుతుందని మంత్రి అంచనా వేశారు. రాజధానితో పాటుగా 26 జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే కేంద్రం బడ్జెట్‌లో అమరావతికి రూ.15000 కోట్లు కేటాయించారు.