శ్రీశైలం మల్లన్నకు భారీగా ఆదాయం
NEWS Aug 24,2024 11:01 am
శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సమర్పించిన కానుకలను.. ఆలయంలోని చంద్రావతి కల్యాణమండపంలో లెక్కించారు. గత 20 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,22,53,862 నగదు వచ్చింది. 150 గ్రాముల బంగారం, 5.250 కిలోల వెండి కూడా కానుకలుగా సమర్పించారు. US డాలర్స్ 746, 125 కెనడా డాలర్లు, 70 యూకే పౌండ్స్, 50 ఆస్ట్రేలియా డాలర్లు 50, uae దిర్హమ్స్ విదేశీ కరెన్సీ కానుకల రూపంలో భక్తులు సమర్పించారు.