బూర్జ ఎస్ఐగా ప్రవళ్లిక బాధ్యతలు
NEWS Aug 24,2024 11:09 am
బూర్జ పీఎస్ నూతన ఎస్ఐ గా ఎం. ప్రవళ్లిక శనివారం బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికి ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్ఐ పలు విషయాలు పై సిబ్బందితో చర్చించారు. నిషేధిత మాదక ద్రవ్యాలు గంజాయి, డ్రగ్స్,అక్రమ రవాణా, దుర్వినియోగం, వాహనాల తనిఖీలు, మహిళల భద్రత తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆమె చెప్పారు. క్రైమ్ రేట్ పెరగకుండా విధులు నిర్వహిస్తానని తెలిపారు.