వరుస అల్పపీడనాలు ఉత్తరాంధ్రలో వర్షాలు
NEWS Aug 24,2024 11:07 am
బూర్జ, పాలకొండ, సరుబుజ్జిలి మండలాల్లో ఉరుములుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడిందని ఇదివరకే వాతావరణ శాఖ తెలియజేసిన సంగతి తెలిసిందే, వరి చేలు నీటి కోసం చూస్తున్న వేళ వర్షాలు కురువడం రైతులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ నెల ఆఖరున ఉత్తరాంధ్ర మీదుగా మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనాతో రైతులు మరింత ఉత్సాహంతో ఉన్నారు.