ASR:రాజవొమ్మంగి మండలం కొండపల్లి మాజీ సర్పంచ్ కుంజం అన్నపూర్ణ (70) శనివారం మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దే చికిత్స పొందుతున్నారని తెలిపారు. దశాబ్ద కాలం క్రితం ఆమె సిపిఎం బలపర్చిన సర్పంచ్ గా పని చేసి మండలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.