కూల్చివేత చట్ట విరుద్ధం: నాగార్జున
NEWS Aug 24,2024 08:50 am
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున X వేదికగా స్పందించారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇది పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు. కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని, అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.