గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన వ్యక్తి మంగళవారం పశువులను మేపేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. చుట్టుప్రక్కల ప్రాంతాలను 4 రోజలు వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న నెల్లిపూడి బ్రిడ్జి క్రింద చనిపోయినట్లు సమాచారం ఇవ్వగా చనిపోయిన వ్యక్తి దాసుగా కుటుంబ సభ్యులు నిర్ధారించుకుని కన్నీరు మున్నీరయ్యారు.