రూ.17.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
NEWS Aug 24,2024 08:55 am
చింతూరు మండలం మోతుగూడెం వద్ద లారీలో తరలిస్తున్న రూ.17.60 లక్షలు విలువైన 350 కిలోల గంజాయి, 100 ఎంఎల్ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారయ్యారని తెలిపారు.