అధ్వానంగా ఉన్న పోతంగి పెదపాడు రోడ్డు
NEWS Aug 24,2024 08:54 am
పోతంగి పంచాయితీ, పెదపాడు గ్రామానికి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. వర్షాలకు వరద నీరు రోడ్డు పైనుంచి ప్రవహించి కోతకు గురైంది. ఓ వైపు ఉన్న మట్టి రోడ్డు పై టూ వీలర్ నడపలేని పరిస్ధితి, మరో వైపు వర్షాకాలంలో చాపరాయి గెడ్డ దాటలేని పరిస్ధితులతో వైద్య సేవలు పొందేందుకు అవస్తలు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. చాపరాయి గెడ్డపై బ్రిడ్జ్, గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు