గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ శివారులో పోలీసులు 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో పుష్ప సినిమా తరహాలో పైన సెంట్రింగ్ పనులకు ఉపయోగించే ఇనుప రేకులు వేసి, కింద గంజాయి కలిగిన బస్తాలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. స్మగ్లర్స్ పరారవ్వగా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.