ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి
NEWS Aug 25,2024 05:56 am
KMR: ఉపాధ్యాయ సంఘ భవనాలకు కేటాయించిన ఉత్తర్వులను రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జివిఎం విఠల్ డిమాండ్ చేశారు. విద్య రంగానికి కేటాయించాల్సిన డబ్బులు ఉపాధ్యాయ సంఘ భవనాలకు కేటాయించడం సిగ్గుచేటు అని అన్నారు. ఎల్లారెడ్డి సంఘం భవనానికి బిక్నూర్ సంఘ భవనానికి రూ. 10 లక్షలు, కామారెడ్డి సంఘ భవనానికి రూ.5 లక్షలు కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.