KMR: బిచ్కుంద మండల PHC ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వ న్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులు ఉండే వార్డులను పరిశీలించారు. రోగులకు వండితున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మందుల గది, ల్యాబ్, స్టోర్ రూం ను పరిశీలించారు. వైద్యుల పనితీరును పర్యవేక్షకురాలు విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. వ్యాధులు రాకుండా ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.