హైదరాబాద్‌కు చెందిన వర్షా రెడ్డి మిసెస్ సౌత్ ఇండియా-2024గా కిరీటాన్ని పొందారు. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 మందిని ఫైనల్స్ కు ఎంపిక చేయగా, వర్షా రెడ్డి టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వెళ్లి టైటిల్ గెలవడం ఆనందంగా ఉందన్నారు.