శ్రావణమాసం, విష జ్వరాలతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో కోళ్ల పరిశ్రమ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగం జరిగేదని, ప్రస్తుతం అది సగానికి పరిమితం అయ్యిందని వ్యాపారస్థులు వాపోయారు. అమ్మకాలు తగ్గడంతో ధరలు పడిపోయాయని అంటున్నారు. కిలో బాయిలర్ చికెన్ ధర రూ.350 నుంచి రూ.185కి, రూ.167 పలికిన లైవ్ ధర రూ.90కి పడిపోయింది.