బేస్తవారిపేట నూతన ఎస్సైగా శనివారం రవీంద్రారెడ్డి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా ఆయన బేస్తవారిపేట పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నరసింహారావు కంభంకు బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రవీంద్రరెడ్డికి స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికి సన్మానించారు. పలువురు నాయకులు ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు.