ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మంత్రి గొట్టిపాటి నేడు పర్యటించనున్నట్లు TDPమండల అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు తెలిపారు. పూరిమెట్ల గ్రామంలో సోలార్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమంకు మంత్రి హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరవుతారని, కూటమి నాయకులు మంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు.