కొరిశపాడు మండలంలోని అన్ని గ్రామాలలో BLOలు సమగ్ర ఓటర్ సర్వే నిర్వహించాలని మండల తహశీల్దార్ B వెంకటేశ్వరరావు ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ సమాచారాన్ని తెలుసుకోవాలని BLOలకు సూచించారు. ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు కార్డు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.