లక్ష్మీ నరసింహ స్వామికి విశేష పూజలు
NEWS Aug 24,2024 05:52 am
కనిగిరి పట్టణంలోని పొదిలి రోడ్డులో కొలువైయున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణశర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనాలను అందజేసి, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుందూరు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యాలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.