పాఠశాలకు వెళ్లాలంటే భయంగా ఉంది
NEWS Aug 24,2024 05:52 am
పాఠశాలకు గ్రామానికి మధ్యలో మద్యం దుకాణం ఉండడంతో మద్యం ప్రియులు రోడ్డుమీద బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని, ఆడపిల్లలను పాఠశాలలకు పంపాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కంభం మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామం నుంచి తురుమెల్ల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలంటే, రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మద్యం దుకాణాన్ని మరోచోటికి మార్చాలని కోరుతున్నారు.