పామూరు పట్టణంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి వైపు నుంచి నెల్లూరు వెళ్తున్న కారు పట్టణంలోని జనతా గ్యారేజ్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పి ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.