అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పొన్నలూరు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పొన్నలూరు మండలంలోని వేంపాడు ఏటిలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్సై గిరిబాబు తన సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని మొదటి తప్పుగా భావించి రూ.10వేలు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.