HYD: అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా ఝులిపిస్తొంది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ శనివారం అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. తమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని జనం కోసం అనే సంస్థ హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేస్తూ పక్కా అధారాలు సమర్పించిన నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.