గిద్దలూరులో నేడు పవర్ కట్
NEWS Aug 24,2024 05:14 am
ప్రకాశం: గిద్దలూరు మండలంలోని విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడి శేషగిరిరావు చెప్పారు. విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని బురుజు పల్లి, ముండ్లపాడు, కృష్ణంశెట్టిపల్లె, అంబవరం, తదితర గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.