శ్రీ సత్య సాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వి.రత్న ఉత్తర్వులు జారీ చేశారు. జప్తు చేసిన ద్విచక్ర వాహనాన్ని ఓ మెకానిక్ షెడ్డు వద్దకు తీసుకెళ్లి విడిభాగాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అయిన విషయం విదితమే. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ప్రాథమిక విచారణ జరిపించి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.