మహిళా మేడలో నుండి బంగారం చోరీ
NEWS Aug 24,2024 05:18 am
అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన మహిళ శివాలయంకు వెళ్లి తిరిగి వస్తుండగా మహిళ మెడలో బంగారు గొలుసులను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కుని పోయారు. పోలీసుల వివరాల ప్రకారం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన మహాలక్ష్మి శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో స్థానిక శివాలయానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ప్రధాన వీధిలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి మహిళ మెడలో బంగారు తాడు, నల్లపూసలు లాగి పట్టుకుపోయారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు.