రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపిస్తామని మంత్రి దుర్గేష్, స్థానిక ఎంపి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం పేపర్ మిల్లు యూనియన్, యాజమాన్యాల ప్రతినిధులతో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నర్సింహ కిషోర్ లు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.