ఎలాంటి సమస్యలు లేకుండా ఇసుక
NEWS Aug 24,2024 05:04 am
ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుంచి ఉచిత ఇసుక విధానంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని ఇసుక విధానం అమలుపై చర్చించారు.