గంజాయిని నిర్మూలించడానికి పటిష్టమైన చర్యలు
NEWS Aug 24,2024 05:03 am
ఏజెన్సీలో గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారిని, వినియోగించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతగిరి, అరకు, గూడెం కొత్తవీధి, జీ.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు, చింతపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 62 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.