సామర్లకోటకు చెందిన మొండి నాగబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనమిక్ జోన్‌లోని ఎసెన్సియా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో నాగబాబు మృతిచెందాడు. నాగబాబు అచ్యుతాపురం ఎసెన్సియా కర్మాగారంలో అసిస్టెంట్ మేనేజర్ (ప్రొడక్షన్)గా పనిచేస్తున్నారు. ఈ మేరకు సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి మృతుడి భార్య సాయిదుర్గకు చెక్కును అందజేశారు.