KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో 9 ఇండ్లలో భారీ చోరీ జరిగింది. నిన్న అర్ధరాత్రి వివేకానంద కాలనీ శ్రీరామ్ నగర్ కాలనీ స్నేహపూర్ కాలనీలలో దొంగలు బీభత్సం సృష్టించారు. తొమ్మిది ఇండ్లలో బంగారం వెండి నగదు అపహరించారు.బాధితుల ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తే ఇంట్లో విలువైన వస్తువులు ఉంచొద్దని సిఐ సూచించారు.