శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి రాజ్యలక్ష్మి అమ్మవారికి పూలంగి సేవ వైభవంగా నిర్వహించారు. అర్చకులు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన మహిళలు భక్తి పాటలు ఆలపించి పూజలు చేశారు.