ఒంగోలు కార్పొరేషన్లో శనివారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశం కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు మేయర్ గంగాడ సుజాత శుక్రవారం తెలియజేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపడుతున్న తరుణంలో శనివారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కౌన్సిల్ సమావేశ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.