ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బొలెరో
NEWS Aug 24,2024 05:38 am
కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీ కొట్టగా, నవీన్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదరు యువకుడు గిద్దలూరు మండలం వెళ్ళుపల్లి గ్రామ వాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.