ఢిల్లీ: టీ- ఫైబర్ ప్రాజెక్టు ద్వారా పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నెలకు కేవలం ₹ 300 లకే ఇంటర్నెట్, టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.