అయినవిల్లి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ అధికారులు అన్నదానం నిర్వహించారు. స్వామివారికి ఈరోజు వివిధ సేవల ద్వారా వచ్చిన ఆదాయం రూ.84 వేలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలియజేశారు.