అరకులోయ: గ్రామసభలో ప్రాధాన్యత పనులకు తీర్మానం
NEWS Aug 23,2024 05:36 pm
పెదలబుడు పంచాయితీ గ్రామసభను సర్పంచ్ పెట్టేలి దాసుబాబు అధ్యక్షతన నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. చేసిన ప్రతిపాదనల ప్రకారం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వ్యవసాయ పనులు వంటి ప్రాధాన్యతా పనులు చేయడానికి తీర్మానించడం జరిగిందన్నారు. మంచినీటికి అరకులోయ టౌన్ షిప్, చిట్టెంగొందిలలో మిని రిజర్వాయర్ లను ఏర్పాటు కొరకు తీర్మానం చేశామన్నారు. ZPTC రోషిణి, APO జగదీష్, నాయకులు, ఉపాధిహామీ కూలీలు, రైతులు పాల్గొన్నారు.